Rashmika Mandanna: పుష్ప 2 షూటింగ్ కోసం రెడీ అయిన రష్మిక.. సెట్‌లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..

రష్మిక మందన్నకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరోవైపు రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' షూటింగ్‌లో పాల్గొంటోంది. సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నా రష్మిక వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా గడిపేస్తోంది.. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటుంది ఈ చిన్నది.

Rashmika Mandanna: పుష్ప 2 షూటింగ్ కోసం రెడీ అయిన రష్మిక.. సెట్‌లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
Rashmika Mandanna

Updated on: Dec 10, 2023 | 8:53 AM

రష్మిక మందన్న పేరు ఇప్పుడు మారుమ్రోగుతుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. రష్మిక మందన్నకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరోవైపు రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ షూటింగ్‌లో పాల్గొంటోంది. సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నా రష్మిక వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా గడిపేస్తోంది.. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటుంది ఈ చిన్నది. దానికి సంబంధించిన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

ప్యాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. అందులో ‘పుష్ప 2’ సినిమా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కుతోంది. ఇన్ని రోజులు ‘యానిమల్’ సినిమా ప్రమోషన్‌కి టైం ఇచ్చి, ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ సెట్స్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుంది రష్మిక. డిసెంబర్ 13 నుంచి పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొంటుంది రష్మిక.

‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప 2 సంచలన విజయం సాధించడంతో ఇపుడు పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. వీటన్నింటి కారణంగా ‘పుష్ప 2’ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు డాలీ ధనంజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.