ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సింగింగ్ కాంపిటేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సింగింగ్ టాలెంట్ షో ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు సీజన్ 3తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ షోకి చాలా మంది గెస్ట్ లు వచ్చారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ జడ్జ్ గా హాజరుకానుంది ఈ అందాల భామ. ఈ సీజన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ, 17వ ఎపిసోడ్‌లు ఈ శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు స్త్రీమింగ్ కానున్నాయి.
రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ మాములుగా ఉండదు. తన చలాకీ తనంతో ఆ వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చేస్తుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై రష్మిక ఎలా సందడి చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబదించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ తన సత్తా చాటింది ఈ చిన్నది. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఎలా సందడి చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి