సినిమా ఇండస్ట్రీలోకి రావడం.. వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద హీరోలు కూడా సులభంగా స్టార్స్‌గా ఎదిగాలేదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. అలాగే హీరోయిన్స్ కూడా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే రష్మిక మందన్న కూడా అంత సులభంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదగలేదు. రష్మిక గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక మందన్న. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ శౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.
ఆతర్వాత తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కార్తీ సరసన సుల్తాన్, విజయ్ సరసన వారసుడు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారిపోయింది. అయితే రష్మికకు కూడా సక్సెస్ అంత ఈజీగా రాలేదు. కెరీర్ బిగినింగ్ లో చాలా అవమానాలు ఎదుర్కొందట.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో చాలా ఆడిషన్స్ ఇచ్చాను. నేను ఆడిషన్స్ కి వెళ్లిన ప్రతిసారి ఎడుస్తూనే ఇంటికి తిరిగొచ్చేదాన్ని.. నువ్వు అసలు నటనకు పనికి రావు అని కూడా అవమానించారు. ఒకసారి ఓ సినిమా కు పదే పదే ఆడిషన్స్ చేశారు. ఏకంగా మూడు నెలలు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత నేను దాదాపు 25 ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాను. అప్పుడు ప్రతి రోజు ఓ యుద్ధంలా ఉండేది. అప్పుడు అందరికి నా నటన పై అనుమానం ఉండేది. కానీ నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తగ్గాలి అని కూడా అనుకోలేదు. ప్రతి సినిమాకు, ప్రతి పాత్రకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాను అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ చిన్నది పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.