Rashmika Mandanna: విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను.. అతడితో డేట్ చేస్తాను.. రష్మిక మందన్న..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే థామా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు టాక్ నడుస్తుంది.

Rashmika Mandanna: విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను.. అతడితో డేట్ చేస్తాను.. రష్మిక మందన్న..
Vijay Deverakonda Rashmika

Updated on: Nov 08, 2025 | 11:24 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారట. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. తాజాగా హానెస్ట్ టౌన్ హాల్ తో క్యాంపస్ తో మాట్లాడిన రష్మిక తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు నటించిన నటులలో ఎవరినీ పెళ్లి చేసుకుంటావని అడగ్గా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

రష్మిక మాట్లాడుతూ.. “నిజాయితీగా చెప్పాలంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. నా ప్రతి విషయాన్ని తన సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి. అతను కొన్ని పరిస్థితులను ఎలా గ్రహిస్తాడు ? ఆ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తిని కోరుకుంటున్నాను. నిజంగా మంచివాడు. నాతో లేదా నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి. రేపు నాపై యుద్ధం జరిగితే నా కోసం పోరాడే వ్యక్తి కావాలి ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

ఆ తర్వాత తాను ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని చంపుతావు..? ఎవరితో డేట్ చేస్తావు.. ? ఎవరిని పెళ్లి చేసుకుంటావు ? అని అడగ్గా.. నరుటో (యానిమేషన్ పాత్ర)తో డేటింగ్ చేస్తానని.. అలాగే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ.. రష్మిక చేసిన కామెంట్స్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

 

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?