Rashmika Mandanna : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లి.. స్పందించిన రష్మిక మందన్న..

ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. మరోవైపు పెళ్లి వార్తలతో నిత్యం వార్లలో నిలుస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై రష్మిక రియాక్ట్ అయ్యింది.

Rashmika Mandanna : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లి.. స్పందించిన రష్మిక మందన్న..
Rashmika

Updated on: Dec 04, 2025 | 10:52 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. గత కొంతకాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు రష్మిక ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి వివాహం ఫిబ్రవరిలో జరగనున్నట్లు టాక్ నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై రష్మిక స్పందించింది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లి గురించి ప్రస్తావించింది. ఈ ప్రచారాన్ని ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఆమె ఇష్టపడలేదు.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

రష్మిక మాట్లాడుతూ.. “నేను వివాహాన్ని ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఇష్టపడను. దాని గురించి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను. సమయం వచ్చినప్పుడే ఆ విషయాలపై స్పందిస్తాను. అప్పటివరకు నేనేం చెప్పను” అని తెలిపింది. దీంతో వీరిద్దరి పెళ్లి వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు వీరిద్దరి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

ఈ ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు టాక్. ఈ వేడుకకు రెండు కుటుంబాలు, అతికొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 2026లో వారు వివాహం చేసుకుంటారని ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?