Rashmika Mandanna: టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీ ఎవరంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ చిన్నది.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను దక్కించుకుంది. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న రష్మికాకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ దక్కింది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మహేష్‌తో జత కట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది రష్మిక. బాలీవుడ్‌లో ఏకంగా అమితాబ్‌తో సినిమా చేస్తుంది రష్మిక.
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో ఓ యంగ్ డైరెక్టర్ సినిమాలో రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మారాడు రాహుల్ రవీంద్రన్. రాహుల్ రవీంద్రన్.. ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. మొదటి సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో కలిసి మన్మధుడు 2 సినిమా చేశాడు. ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఇదొక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకుంటున్నారని తెలుస్తుంది. కథ నచ్చడటంతో రష్మిక కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :