
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ గా మారిపోయింది. చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది. మహేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది రష్మిక.
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. రీసెంట్ గా కుబేర సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ నేషనల్ క్రష్. అయితే రష్మికాకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మికకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రష్మికాను కలవాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. తాజాగా తనకు కలవడానికి ఓ క్రేజీ అఫర్ ఇచ్చింది రష్మిక. నేనే నేరుగా మీ వద్దకు వచ్చి కలుస్తాను అని చెప్తుంది ఈ చిన్నది. తాను వచ్చి కలవాలంటే తాను చెప్పిన పని చేయాలి అని అంటుంది.
తాజాగా రష్మిక ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ కొత్త మూవీకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడమే కాదు.. అభిమానులకు ఒక పరీక్ష కూడా పెట్టింది. అదేంటంటే..” నా నెక్స్ట్ సినిమా టైటిల్ ను గెస్ చేయగలరా.? ఒకవేళ మీరు సినిమా టైటిల్ ను గెస్ చేస్తే నేను నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను ” అంటూ సోషల్ మీడియలో రాసుకొచ్చింది రష్మిక. ఈ సినిమాలో రష్మిక డిఫరెంట్ లుక్ లో కనిపించనుంది. రేపు ఉదయం 10:00గంటలకు టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.
Can you guess what the title of my next could be? 😉
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. 🐒😎 pic.twitter.com/7KPl6UyVJN— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి