Pogaru Twitter Review :
నటులు : ధృవ సర్జా, రష్మిక మందన్న
దర్శకుడు : నందన్‌కిషోర్
నిర్మాత : ప్రతాప్‌రాజు(తెలుగు)
సంగీతం : చందన్‌శెట్టి
ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేసారు. ‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్’ గాఈ సినిమాతెరకెక్కింది. అర్జున్ జన్యా, చందన్‌శెట్టి. ఈ సినిమాకు సంగీతం అందిచారు. ఈ సినిమాలోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాట సంచనం సృష్టించింది. యూట్యూబ్ లోఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కాయి. ఫిబ్రవరి 19(శుక్రవారం)ఈ సినిమాప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇకఈ సినిమా ఎలా ఉందొ ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ..
సామాన్యులను ఇబ్బంది పెట్టే వారితో పోరాడే వ్యక్తిగా ధృవ సర్జా కనిపించాడు. ఈ సినిమాలో దృవ లుక్ ఉరమాస్ గా ఉంది. ఇక ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం ధృవ సర్జా ఏకంగా 30 కిలోల బరువు తగ్గాడట. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లో ధృవ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించడు. ఆ షడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ భారీగా బరువు పెరిగాడట. రూ .25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ధనంజయ్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పి రవిశంకర్, కై గ్రీన్, సాధు కోకిలా, కుట్టి ప్రతాప్, మోర్గాన్ ఆస్టే ముఖ్య పాత్రల్లో నటించారు.చందన్‌శెట్టి అందించిన సంగీతం అలరించింది.
సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పనితనం బాగుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లోకల్ లుక్స్, డైలాగ్ డెలివరీలతో కూడిన ధ్రువ సర్జా, మొత్తం సినిమాను సింగిల్ హ్యాండ్ తో నడిపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు . మాస్ ఆడియన్స్ ఆకలితీర్చే సినిమా అని కొందరు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
U/A
159.44 mins
Action, Drama
— cineloka.co.in (@cineloka) February 19, 2021
— Cineloka Sunil (@SunilCineloka) February 19, 2021
— Cineloka Sunil (@SunilCineloka) February 19, 2021
NW: #Pogaru in Siddeshwara theater it’s Housefull??
KFI is Back?— KM ⚡ (@moviefreak143) February 19, 2021