అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ క్రేజ్‌తోనే అటు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతోంది. ఇటీవల బిగ్ బీ అమితాబ్ కలిసి గుడ్‌బై అనే హిందీ చిత్రంలోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ క్వీన్. సిల్వర్ స్ర్కీన్‌పై హుషారైన యాక్టింగ్, డ్యా్న్స్‌తో అలరించే రష్మిక ఇటీవల ఆఫ్‌స్ర్కీన్‌లోనూ ఫ్యాన్స్‌నూ ఆకట్టుకుంది. టీవీ షోలు, అవార్డు ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తోంది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని తన సిగ్నేచర్ స్టెప్‌ను ఇటీవల పలు సందర్భాల్లో రీక్రియేట్ చేసింది. సల్లూభాయ్, గోవిందా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ‘రారా సామి.. బంగారు సామి’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టింది రష్మిక. ఈసారి బేబమ్మ కూడా శ్రీవల్లికి జత కలిసింది. ఇలా ఇద్దరూ ముద్దుగుమ్మలు ఒకే సారి డ్యాన్స్ చేయడంతో ప్రేక్షకులకు కనులవిందుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఇదే ఫంక్షన్‌లో పుష్ప హీరో అల్లు అర్జున్, రాక్‌స్టార్ సందడి చేశారు. రష్మిక, కృతి శెట్టిల డ్యాన్స్‌ను చూసి మురిసిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2.. దిరూల్’ లో నటిస్తోంది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో వారిసు (తెలుగులో వారసుడు), సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ చిత్రాల్లో కూడా కనిపించనుంది. ఇక కృతి విషయానికొస్తే అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళం, మలయాళం ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..