Rashmika Mandanna: ‘ఫేక్ యాడ్స్‌తో మోసం చేస్తున్నారా..’ మరో వివాదంలో రష్మిక.. అదేంటంటే.?

నేము.. ఫేము.. వచ్చాక ఓ సెలబ్రిటీ చుట్టూ.. MNC కంపెనీలు.. వెంటపడడం, వారి బ్రాండ్‌నో.. లేక ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడం కామన్.

Rashmika Mandanna: ఫేక్ యాడ్స్‌తో మోసం చేస్తున్నారా.. మరో వివాదంలో రష్మిక.. అదేంటంటే.?
Rashmika Mandanna

Updated on: May 11, 2023 | 3:23 PM

నేము.. ఫేము.. వచ్చాక ఓ సెలబ్రిటీ చుట్టూ.. MNC కంపెనీలు.. వెంటపడడం, వారి బ్రాండ్‌నో.. లేక ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడం కామన్. అయితే ఈ కామన్‌లోనూ.. సెలబ్రిటీలు తమ ఇష్టాఇష్టాలు మరిచి.. ఆయా బ్రాండ్‌లను ప్రమోట్‌ చేయడం వెరీ వెరీ కామన్‌. అయితే సెలబ్రిటీలందరూ.. దాదాపు బయట పడకుండా చేసే ఈ తంతులో.. తాజాగా అడ్డంగా బుక్‌ అయ్యారు రష్మిక. మెక్‌డోనాల్డ్స్‌ స్పైసీ చికెన్ బర్గర్‌ను ప్రమోట్ చేస్తూ పప్పులో కాలేశారు. నెటిజెన్లకు మళ్లీ దొరికిపోయి.. సోషల్ మీడియలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

ఎస్! నేషనల్ క్రష్ గా మారిన తరువాత అటు స్టార్ హీరోల సినిమాల్లోనూ.. ఇటు యాడ్స్‌ షూట్స్‌లోనూ తెగ బిజీగా మారి పోయిన రష్మిక.. ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కు యాడ్ చేశారు. అందులో మెక్‌డోనాల్డ్స్‌ piri piri mcspicy చికెన్ బర్గర్‌ను ప్రమోట్ చేశారు. డిలీషియస్‌ గా ఉన్న బర్గర్‌ను స్లోమోషన్లో ఆస్వాదిస్తూ.. అందరికీ నోరూరేలా చేశారు. ఆ యాడ్‌లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ట్రెండ్ అవ్వడమే కాదు ఈ యాడ్ కారణంగా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పాటు నెటిజెన్లకు అడ్డంగా దొరికిపోయారు. రష్మిక ప్యూర్‌ వెజీ కదా.. నాన్‌ వెజ్ బర్గర్‌ తినడం ఏంటనే డౌట్ అందర్లో ఇన్‌స్టెంట్‌గా పుట్టేలా చేసి.. నవ్వుల పాలయ్యారు.

అంతేకాదు.. గతంలో కరోనా లాక్ డౌం టైమ్‌లో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కోసం లైవ్‌లోకి వచ్చిన రష్మిక తాను ప్యూర్ వెజిటేరియన్‌ అని చెప్పారు. ఇక ఆ వీడియో క్లిప్‌కు … ఈ యాడ్‌ క్లిప్‌ను యాడ్‌ చేసి.. కొంత మంది నెటిజెన్లు రష్మికను ఆడుకుంటున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫేక్ యాడ్స్‌తో.. తన ఫ్యాన్స్‌నే మోసం చేస్తోందంటూ.. రష్మికను ఏకిపారేస్తున్నారు. సెలబ్రిటీస్‌ హిపోక్రసీకి రష్మిక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ.. తన కామెంట్స్‌లలో కోట్ చేస్తున్నారు.