Rashmika mandanna : విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. రష్మిక సమాధానం ఏంటో తెలుసా..

టాలీవుడ్ ల్లో ప్రస్తుతం లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న భామ రష్మిక మందన.

Rashmika mandanna : విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. రష్మిక సమాధానం ఏంటో తెలుసా..
Rashmika Coments

Updated on: Jun 30, 2021 | 11:04 AM

Rashmika mandanna : టాలీవుడ్ ల్లో ప్రస్తుతం లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న భామ రష్మిక మందన. తెలుగులో తక్కువ టైం లోనే రష్మిక విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక..ఆతర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఆతర్వాత మరో విజయ్ కు జోడీగా డియర్ కామ్రేడ్ సినిమాలో చేసింది రష్మిక. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విజయ్ తో నటించడంతో ఈ ఇద్దరి పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వీళ్లిద్దరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. దాంతో విజయ్ రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే పలు సందర్భాల్లో ఈ వార్తలు విజయ్ -రష్మిక దగ్గరకు వెళ్లగా సున్నితంగా తిరస్కరించారు.

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. విజయ్‌ దేవరకొండతో తనకున్న రిలేషన్‌ షిప్‌ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా రష్మిక స్పందించింది. విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. విజయే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అని సమాధానం ఇచ్చింది రష్మిక. ఇక రష్మిక సైనికమలా విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది ఈ నేషనల్ క్రష్.

మరిన్ని ఇక్కడ చదవండి :

లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked

Karthika Deepam: మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం దీపకు చెప్పిన భాగ్యం.. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న కార్తీక్

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..