Kadappa: రాంగోపాల్ వర్మ ‘కడప్ప’ వెబ్‌సిరీస్‌.. మరో సంచలనానికి సిద్ధం

|

Aug 09, 2021 | 2:33 AM

రాంగోపాల్ వర్మ వెరైటీ స్టోరీలు, విభిన్న నేపథ్యాలు ఎంచుకుంటూ సినిమాలు తీస్తుంటాడు. వాస్తవానికి చాలా దగ్గరగా సినిమాలు తీసే వర్మ.. ఈ సారి మరో సంచనాలనానికి తెర తీశాడు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీని పలకరించేందుకు సిద్ధమయ్యాడు.

Kadappa: రాంగోపాల్ వర్మ ‘కడప్ప’ వెబ్‌సిరీస్‌.. మరో సంచలనానికి సిద్ధం
Ram Gopal Varma Kadappa We Seires
Follow us on

Kadappa: రాంగోపాల్ వర్మ వెరైటీ స్టోరీలు, విభిన్న నేపథ్యాలు ఎంచుకుంటూ సినిమాలు తీస్తుంటాడు. వాస్తవానికి చాలా దగ్గరగా సినిమాలు తీసే వర్మ.. ఈ సారి మరో సంచనాలనానికి తెర తీశాడు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ‘రక్త చరిత్ర’తో ఫ్యాక్షన్‌ను రాంగోపాల్ వర్మ.. తనదైన స్టైల్‌లో చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు కంటిన్యూగా తాజాగా ‘కడప్ప’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తీశాడు. ఈమేరకు ట్రైలర్‌ను విడుదల చేసి ఆసక్తిని పెంచాడు. పగల కారంణంగా కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకుంది ఫ్యాక్షన్‌ వార్‌. ప్రతీకార జ్వాలల నేపథ్యంలో వస్తున్న వెబ్‌సిరీస్‌ ‘కడప్ప’. ఈ వెబ్ సిరీస్‌లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజ జీవితాల ఆధారంగా ఉండబోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

ఒక ప్రాంతపు నిజ సంఘటనల ఆధారంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న తొలి వెబ్ సిరీస్‌ ‘కడప్ప’ అని పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

Also Read: Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..