Ante Sundaraniki: మరోసారి సందడి చేయనున్న సుందరం.. రంగో రంగా లిరికల్ సాంగ్ రిలీజ్..
శ్యామ్ సింగరాయ్ తర్వాత అంటే సుందరానికీ సినిమాలో నాని సరికొత్త లుక్కులో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న
బ్రోచేవారెవరురా మూవీ ఫేమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ సినిమా అంటే సుందరానికీ.. న్యాచురల్ స్టార్ నాని.. మలయాళ బ్యూటీ నజ్రీయా నజిమ్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగించాయి. శ్యామ్ సింగరాయ్ తర్వాత అంటే సుందరానికీ సినిమాలో నాని సరికొత్త లుక్కులో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అంటే సుందరానికీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఎంత చిత్రం అనే లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
అంటే సుందరానికీ సినిమా నుంచి రంగో రంగా అనే మరో లిరికల్ సాంగ్ ను మే 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నాని.. తలకు చిన్న గాయం.. చేతులతో సైకిల్ పట్టుకుని భయంగా చూస్తు కనిపిస్తున్నాడు.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా..యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమా జూన్ 10న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈమూవీతోపాటు.. నాని.. దసరా సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ట్వీట్..
Kickstarting with a quirk 😉#AnteSundaraniki #RangoRanga pic.twitter.com/bgYY7xq3h7
— Nani (@NameisNani) May 21, 2022