Ranbir Kapoor: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న రణబీర్ కపూర్.. లేటేస్ట్ మూవీతో ఏకంగా 100 కోట్ల వసూల్

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం వరకు తూ జూతి మైన్ మక్కర్ 100 కోట్ల కలెక్షన్స్ సాధించగా తాజాగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Ranbir Kapoor: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న రణబీర్ కపూర్.. లేటేస్ట్ మూవీతో ఏకంగా 100 కోట్ల వసూల్
Ranbir Kapoor

Updated on: Mar 30, 2023 | 8:14 AM

కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్‌తో నిరాశలో ఉన్న బాలీవుడ్‌కి రణబీర్ కపూర్ మరోసారి సక్సెస్ అందించాడు. గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాతో పర్వాలేదనిపించే హిట్ కొట్టిన రణబీర్ కపూర్ ఇప్పుడు తూ జూతి మైన్ మక్కర్‌తో రికార్డు తిరగరాశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం వరకు తూ జూతి మైన్ మక్కర్ 100 కోట్ల కలెక్షన్స్ సాధించగా తాజాగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 201 కోట్ల గ్రాస్ లో 161 కోట్లు ఇండియా నుంచి, మిగిలిన 40 కోట్లు విదేశాల నుంచి వచ్చాయి. ఓవరాల్ గా దాదాపు 140 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో చిత్రయూనిట్, రణబీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రద్ధ కపూర్ జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా నిర్మాణం కోసం దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. ఈ వీకెండ్ లోపు ఆ కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు.

తూ జూతి మైన్ మక్కర్ సినిమాకు 200 కోట్లు రావడంతో మరోసారి బాలీవుడ్ లో ఆశలు చిగురించాయి. త్వరలో రాబోయే మరిన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నారు.