Animal Movie: బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న యానిమల్.. ఇప్పటివరకు ఎంత వసూల్ చేసిందంటే

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్నటించారు. ఈ చిత్రం ఆదివారం కూడా (డిసెంబర్ 17) భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ 500 కోట్ల రూపాయలు సాధించి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది 500 కోట్ల క్లబ్‌లో చేరిన నాల్గవ హిందీ చిత్రంగా 'యానిమల్' నిలిచింది.

Animal Movie: బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న యానిమల్.. ఇప్పటివరకు ఎంత వసూల్ చేసిందంటే
Animal

Updated on: Dec 18, 2023 | 8:01 PM

‘యానిమల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్నటించారు. ఈ చిత్రం ఆదివారం కూడా (డిసెంబర్ 17) భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ 500 కోట్ల రూపాయలు సాధించి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది 500 కోట్ల క్లబ్‌లో చేరిన నాల్గవ హిందీ చిత్రంగా ‘యానిమల్’ నిలిచింది.

డిసెంబర్ 1న గ్రాండ్ గా  ‘యానిమల్’ సినిమా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ముందుగా నెగిటివ్ ప్రచారం వచ్చినా.. కూడా సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ సినిమా రోజూ రోజూ వసూళ్లు రాబట్టడం ప్రారంభించింది. ఈ చిత్రం ఆదివారం నాడు 12 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా మొత్తం వసూళ్లు 500 కోట్ల రూపాయలుకు చేరింది.

‘యానిమల్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే విదేశాల్లో ఈ సినిమా 17 రోజుల్లో 300 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అమెరికా లాంటి చోట్ల ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో రణ్‌బీర్‌, రష్మిక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, శక్తి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ‘ నటి త్రిప్తి డిమ్రీ ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకుంది. తన బోల్డ్ క్యారెక్టర్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.