IIFA 2024: షారుఖ్, కరణ్ జోహార్ కాళ్లకు నమస్కరించిన రానా.. నెటిజన్స్ ప్రశంసలు.. వీడియోస్ వైరల్..

ఈ వేడుకకు రానా హోస్ట్ గా వ్యవహారించాడు. ముందు నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న రానా.. ఇప్పటికే పలు ఈవెంట్లలో హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఫా అవార్డుల వేడుక కోసం నిర్వహించిన ప్రీ స్పెషల్ ఈవెంట్లో హోస్ట్ గా అలరించారు.

IIFA 2024: షారుఖ్, కరణ్ జోహార్ కాళ్లకు నమస్కరించిన రానా.. నెటిజన్స్ ప్రశంసలు.. వీడియోస్ వైరల్..
Rana

Updated on: Sep 11, 2024 | 2:56 PM

సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం తాజాగా ముంబయిలో ఓ స్పెషల్ ప్రీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‏కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, రానా, కరణ్ జోహర్, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీలు హాజయ్యారు. ఇక ఈ వేడుకలో షారుఖ్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వేడుకకు రానా హోస్ట్ గా వ్యవహారించాడు. ముందు నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న రానా.. ఇప్పటికే పలు ఈవెంట్లలో హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఫా అవార్డుల వేడుక కోసం నిర్వహించిన ప్రీ స్పెషల్ ఈవెంట్లో హోస్ట్ గా అలరించారు.

ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, ప్రొడ్యూసర్ రానా స్టేజ్ పైకి రాగానే వెంటనే వారిద్దరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత రానాను దగ్గరకు తీసుకుని హత్తుకుని ముద్దు పెట్టాడు షారుఖ్. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. రానా చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. తనకంటే పెద్దవాళ్లను గౌరవించాలని రానా అలా వారిద్దరి కాళ్లకు నమస్కరించాడని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపించవు.. కానీ రానా మరోసారి మన సౌత్ ఇండస్ట్రీ సంప్రదాయాన్ని ఐఫా వేదికపై నిలబెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ షోలో షారుఖ్ కొత్త హెయిర్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటివరకు పొడవాటి జుట్టులో కనిపించిన బాద్ షా ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చారు. జవాన్ 2 లుక్ ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us