Rana Daggubati : పాన్ ఇండియా యాక్టర్ క్రెడిట్ ను కాపాడుకుంటున్న దగ్గుబాటి కుర్ర హీరో..

|

Mar 04, 2022 | 9:00 PM

సినిమాల్లో నటిస్తూనే గ్యాప్ దొరికినప్పుడు సైడ్ బిజినెస్ చేసే స్టార్లు చాలామందే వుంటారు. దగ్గుబాటి రానా అయితే.. ఈ సైడ్‌ బిజినెస్‌లో ఆరితేరిపోయారు.

Rana Daggubati : పాన్ ఇండియా యాక్టర్ క్రెడిట్ ను కాపాడుకుంటున్న దగ్గుబాటి కుర్ర హీరో..
Rana
Follow us on

Rana Daggubati : సినిమాల్లో నటిస్తూనే గ్యాప్ దొరికినప్పుడు సైడ్ బిజినెస్ చేసే స్టార్లు చాలామందే వుంటారు. దగ్గుబాటి రానా అయితే.. ఈ సైడ్‌ బిజినెస్‌లో ఆరితేరిపోయారు. ఆయన చెయ్యి పెట్టని ఫీల్డంటూ లేనే లేదు. వాటన్నిటికంటే రానాకు బాగా వర్కవుటైన సైడ్‌ బిజినెస్ వేరే వుంది. ఫ్యూచర్‌లో కూడా ఆ సైడ్‌ బిజినెస్సే ఎక్కువగా చేస్తారట. ఇంతకూ రానా చేస్తున్న ఆ సైడ్‌ బిజినెస్ ఏంటంటే..కొంతమంది గురుపూజ్యుల పుణ్యమా అని మంచి యాక్టర్‌నైతే అయ్యా… హీరో ఎలా అవ్వాలన్నదే అర్థం కాలేదని ఓపెన్‌గా ఒప్పుకున్నారు రానా. డెబ్యూ మూవీ లీడర్‌తో మొదలుపెడితే సోలో సినిమాలేవీ రానా గ్రాఫ్‌ని నిలబెట్టలేపోయాయి.

పన్నెండేళ్ల స్పాన్‌లో కథానాయకుడిగా రానా పెట్టని ఎఫర్ట్ అంటూ లేనేలేదు. అరణ్య లాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా రానా ఫిల్మోగ్రఫీలో వున్నాయి. నా ఇష్టం సినిమాలతో లవర్‌బాయ్‌గా ట్రై చేశారు. ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్లి ఘాజీ ఎటాక్‌ లాంటి ఎక్స్‌పరిమెంట్స్ చేశారు. కానీ.. మరో హీరోతో కలిసి సైడ్‌లో నిలబడి చేసిన సినిమాలే రానాకు లైఫ్‌నిచ్చాయి. వర్మ తీసిన డిపార్ట్‌మెంట్‌ మూవీలో సంజయ్‌దత్‌తో స్క్రీన్‌షేర్ చేసుకుని, నార్త్‌లో పాగా వెయ్యగలిగారు. తర్వాత బాహుబలితో ఢీకొట్టే భల్లాల దేవుడిగా జక్కన్న ఇచ్చిన ట్రెయినింగ్‌తో ది బెస్ట్ అనిపించుకున్నారు దగ్గుబాటి హీరో.
ఎన్టీయార్ మహానాయకుడులో చంద్రబాబు గెటప్ వేసి, బాలయ్యతో కలిసి నటించి తన వెర్సటాలిటీని జబర్దస్త్‌గా రీఎస్టాబ్లిష్ చేసుకున్నారు రానా. లేటెస్ట్‌గా బీమ్లానాయక్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అహంకారి డానియల్ శేఖర్‌గా కూడా డిస్టింక్షన్‌ మార్కులతో పాసయ్యారు. పవర్‌స్టార్‌తో పాటు తాను కూడా ఫ్యాన్‌బేస్‌ని పెంచుకున్నారు. ఇలా సోలోగా కంటే ఒక సైడ్‌లో నిలబడి చేసే పాత్రలే రానాకు సూపర్‌గా ప్లస్ అవుతున్నాయి. అందరూ పాన్ ఇండియా హీరోలయ్యే ప్రయత్నంలో బిజీగా వుంటే రానా మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అనే క్రెడిట్‌ని చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..