ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం’పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈచిత్రం నేడు (డిసెంబర్17) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా నిన్ననే యూఏఈ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాగా రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణలో కొన్ని థియేటర్లలో అర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలు పడ్డాయి. అలాగే ఆంధ్రాలోనూ పలు థియేటర్లోనూ ముందస్తు షోలు పడ్డాయి. ఈక్రమంలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడని, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని, ప్రతినాయక పాత్రల్లో ఫాహద్ ఫాజిల్, సునీల్ ఆకట్టుకున్నారని చాలామంది చెబుతున్నారు.
ఈక్రమంలో తాజాగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ‘పుష్ప’ సినిమాపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ‘ బన్నీ.. ‘పుష్ప’ సినిమా సూపర్‌హిట్‌గా నిలవనుంది. ఈ సినిమా కోసం మీరెంతో కష్టపడ్డారు. సుకుమార్ మీ విజన్ మైండ్ బ్లోయింగ్. రష్మికతో పాటు ఈ సినిమాలో భాగమైన వారందరికీ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. కాగా బన్నీ- సుకుమార్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. మొదటిసారిగా ఊరమాస్ పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. రష్మిక, అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ అందించిన స్వరాలు సూపర్‌హిట్‌గా నిలవగా, సమంత ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా సినిమా చూసిన వారందరూ సామ్ సాంగ్ అదిరిపోయిందంటున్నారు.
Also Read: