ఉప్పెన హీరోయిన్‌పై ప్రశంసల జల్లు.. భవిష్యత్‌లో ఆమె డేట్స్ దొరకడం కష్టమంటున్న మెగా పవర్‌ స్టార్..

|

Feb 18, 2021 | 11:51 AM

కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టి గురించి మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి సినిమాతోనే

ఉప్పెన హీరోయిన్‌పై ప్రశంసల జల్లు.. భవిష్యత్‌లో ఆమె డేట్స్ దొరకడం కష్టమంటున్న మెగా పవర్‌ స్టార్..
Follow us on

కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టి గురించి మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ తాజాగా రాజమహేంద్రవరంలో జరిగాయి. ఈ విజయోత్సవ వేడుకకు రామ్‌చరణ్‌ తేజ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు.

అనంతరం కృతిశెట్టిపై పొగడ్తల వర్షం కురిపించారు. కృతి నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. కృతి నటనతో అందరి హృదయాలు గెలుచుకున్నావని, ఈ ఫంక్షన్‌లో మా కుర్రోళ్లందరూ ఇంతలా రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్లే అని చమత్కరించారు. ఇటీవల కాలంలో ఓ కొత్త హీరోయిన్‌కి ఇంత గ్రాండ్‌ వెల్‌కమ్‌ చూడలేదన్నారు. కెరీర్‌లో ఆమె ఎన్నో ఉన్నతశిఖరాలకు వెళ్లాలని ఆశిస్తున్నానని, భవిష్యత్తులో ఆమె డేట్స్‌ దొరకడం కష్టం కావొచ్చని జోస్యం చెప్పారు.

మీకు తిన్న ఆహారం జీర్ణమవడం లేదా..? అయితే ఈ సమస్యలకు గురై ఉంటారు.. ఒక్కసారి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి..