
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న (సెప్టెంబర్ 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తోలి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ మాస్ అవతార్ కు బోయపాటి యాక్షన్ తోడవ్వడంతో స్కంద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్ మాస్ మసాలా అవతార్ లో అడగొట్టారు. అలాగే బోయపాటి డైలాగులు థియేటర్స్ లో విజిల్స్ కొట్టిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ బిజినెస్ చేసింది. అలాగే అప్పుడు విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. దాంతో ఈ సినిమాలు తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందంటే.. నైజాం 10.80 కోట్లు, సీడెడ్ 8.80 కోట్లు, ఆంధ్ర 19.00కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 38.60 కోట్లు. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 2.40కోట్లు, ఓవర్సీస్ లో 1.50 కోట్లు, వరల్డ్ వైడ్ గా 42.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 18.2 గ్రాస్ వసూల్ చేసింది స్కంద. అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్కంద సినిమా 8.62 కోట్ల వరకు షేర్స్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.రామ్ పోతినేని కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపినింగ్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు ఉన్నారు. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ లో స్కంద సినిమా దూసుకుపోతుంది. వీకెండ్ కావడంతో రాబోయే రెండు రోజులు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
#Skanda – The Attacker Releasing Today 🔥🔥🔥🔥#SkandaStormFromToday pic.twitter.com/0ILAke6CF0
— Skanda Movie Official (@SkandaOffl) September 27, 2023
A MASS EXPLOSION WORLDWIDE💥💥#Skanda Roaring on Big Screens Today!❤️🔥
Grand Release in Telugu, Tamil, Hindi, Kannada & Malayalam 😍
Book 🎟- https://t.co/TGEPPjMfYd#RAmPOthineni #SkandaStormFromToday
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar pic.twitter.com/KDnXLAbASA
— Team Ram Pothineni (@TeamRaPo) September 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..