రామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..సిల్వ‌ర్ స్క్రీన్ పైనే

రామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..సిల్వ‌ర్ స్క్రీన్ పైనే

ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీలో రీ సౌండ్ ఇచ్చే హిట్ న‌మోదు చేసుకున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌లో విడుద‌ల‌ కావలసిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిది పడింది. అయితే లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పెంచే అవ‌కాశం ఉందని వార్త‌లు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై.. రామ్ […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 5:15 PM

ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీలో రీ సౌండ్ ఇచ్చే హిట్ న‌మోదు చేసుకున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌లో విడుద‌ల‌ కావలసిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిది పడింది. అయితే లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పెంచే అవ‌కాశం ఉందని వార్త‌లు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై.. రామ్ డైలమాలో ఉన్నాడా? అని ఓ న్యూస్ పేప‌ర్ లో వచ్చింది. ఆ వార్తను పోస్టు చేస్తూ ఓ ఫ్యాన్… రామ్ డైలమాలో ఉన్నాడా ? ఎంత లేట్ అయిన పర్లేదు అన్నా. సినిమాని థియేటర్‌లో విడుద‌ల‌ చేయండి. థియేటర్స్‌లో వచ్చే వరకు మేం అదే ప్రేమతో , ఓపికతో ఉంటాం అని పేర్కొన్నాడు.

నెటిజన్ ట్వీట్‌కు హీరో రామ్ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఎటువంటి డైలమాలో లేన‌ని తేల్చి చెప్పాడు. నిజానికి అత‌డు గ‌వ‌ర్న‌మెంట్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ , స్వీయ నిర్భంధంలో ఇంట్లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. గత 15 ఏళ్లుగా జరుగుతున్నట్లుగానే… తన అభిమానులంద‌రూ రెడ్ సినిమాని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరుకుంటున్నాడు అని తన ట్విట్టర్‌లో వెల్ల‌డించాడు. రామ్ వివరణతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ మూవీకి..మ‌ణిశ‌ర్మ‌ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ చిత్రం ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా రెడ్ థీమ్ తీసుకున్నాడు ద‌ర్శకుడు. మూవీ టైటిల్ మాదిరిగానే స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటాయని డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu