Andhra King Taluka : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

చాలా కాలం తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో రామ్ పోతినేని. డైరెక్టర్ మహేష్ బాబు. పి తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే రామ్ కెరీర్ లో డీసెంట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Andhra King Taluka : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Andhra King Taluka

Updated on: Dec 20, 2025 | 12:23 PM

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. చాలా కాలం తర్వాత రామ్ కెరీర్ లో మంచి పాజిటిక్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ఇది. ఇందులో రామ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

ఈ సినిమాను క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను మొత్తం పాన్ ఇండియా భాషలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..

కథ విషయానికి వస్తే.. సూర్య (ఉపేంద్ర) వందో సినిమా చేస్తుండగా.. అభిమానులు ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు. సినిమా ముందుకు వెళ్లాలంటే రూ.3 కోట్లు కావాల్సి ఉంటుంది. సూర్య చాలా మందిని సాయం కోరతాడు. చివరకు ఆస్తులను సైతం అమ్ముకోవాలని చూస్తుంటారు. అప్పుడే అతడి అకౌంట్ లోకి రూ.3 కోట్లు జమ అవుతాయి. ఆ డబ్బును తన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి జమ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ సాగర్ ఎవరు.. ? అతడి గురించి సాగర్ కు ఎలాంటి విషయాలు తెలిశాయి అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..