ఊర మాస్ శంకర్..పూరి మార్క్ ట్రైలర్

|

Jul 03, 2019 | 5:28 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా..డాషింగ్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయ్యింది. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పూరి అండ్ టీం..ట్రైలర్‌తో మాస్ మీల్స్ రుచి చూపించింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పూర్తిగా హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ ఊర మాస్ లోకల్  డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. గతంలో మరే సినిమాలో కనిపించనంత మాస్ లుక్‌లో రామ్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాడు.  ‘ఇస్మార్ట్ […]

ఊర మాస్ శంకర్..పూరి మార్క్ ట్రైలర్
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా..డాషింగ్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయ్యింది. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పూరి అండ్ టీం..ట్రైలర్‌తో మాస్ మీల్స్ రుచి చూపించింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పూర్తిగా హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ ఊర మాస్ లోకల్  డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

గతంలో మరే సినిమాలో కనిపించనంత మాస్ లుక్‌లో రామ్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాడు.  ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటాష్ నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ మూవీ విజయం అటు హీరో రామ్‌తో పాటు..దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కీలకం కానుంది.