RGV Tweet: కరోనా మహమ్మారికి వారు, వీరూ అనే తేడా లేకుండా పోయింది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో మరణించారు కూడా. ఇక దేశాలను గడగడలాడించిన నేరస్థులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. తాజాగా అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. చోట రాజన్ బతికే ఉన్నాడని తీహార్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. కరోనాతో బాధపడుతన్న చోటా రాజన్‌ని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
COVID killed CHOTA RAJAN and it dint even care that he is no.2 man of D COMPANY ..I wonder why he dint shoot it ??.. Seriously speaking I wonder how DAWOOD IBRAHIM is feeling ??
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021
ఇక చోటా రాజన్ కరోనాతో మరణించాడన్న వార్త తెలియగానే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చోటా రాజన్‌ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్‌ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
Apparently the news about Chota Rajan’s death is a rumour .. So it’s not Covid but it’s the rumour mongers who killed him ..I stand corrected ..He’s just admitted in hospital for Covid ..Hope he gets bed and oxygen
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021
అయితే తీరా.. చోటా రాజన్ చనిపోలేడన్న అధికారిక ప్రకటన రావడంతో వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వార్తపై వర్మ స్పందిస్తూ.. ‘చోటా రాజన్ చనిపోయాడన్నవార్తలో నిజం లేదు. కరోనా కాదు.. పుకారే ఆయనను చంపింది. చోటా రాజన్‌కు బెడ్, ఆక్సిజన్ అందాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.
Also Read: వెల్లుల్లితో నిజంగానే బీపీని కంట్రోల్ చేయవచ్చా ? దీంతో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..
Makkah: కాబా అరుదైన చిత్రాలను విడుదల చేసిన సౌదీ అరేబియా.. 7 గంటలపాటు శ్రమించి..
Thank You Movie: షూటింగ్ పూర్తిచేసుకున్న థ్యాంక్యూ టీం.. చైతో సెల్ఫీని షేర్ చేసిన రాశిఖన్నా..