RGV: వర్మ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు.. ఆయన నుంచి వచ్చిన సమాధానం ఇదే..

|

Dec 12, 2022 | 5:43 PM

వర్మ.. మన కర్మ అనేవాళ్లు కొందరు.. ఆయన్ను తీసుకెళ్లి అడవుల్లో వదిలేయాలనేవారు ఇంకొందరు. ఆయనో జీనియస్.. మీకు అర్థం కాడులే అనేవాళ్లు కూడా అక్కడక్కడా ఉన్నారు.

RGV: వర్మ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు.. ఆయన నుంచి వచ్చిన సమాధానం ఇదే..
Ram Gopal Varma - Ashu Reddy
Follow us on

ఆర్జీవీ.. ఆయన వింత జీవి. ఆయన ఫలానా టైప్ అని స్టేట్మెంట్ పాస్ చేయడం చాలా కష్టం. ఆర్జీవీ ఎవ్వరికీ అర్థం కానీ ఓ మిస్టరీ. ఈయన వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. అయితే తన రాతలపై, మాటలపై, ట్వీట్లపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మోనార్క్ మాదిరిగా సమాధానాలు ఇస్తారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఏది పడితే అది మాట్లాడటం.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ వీడియోలు చేయడాన్ని ఎప్పుడూ సమర్థించుకునే ఆర్జీవీ.. తాజాగా ఆషూ రెడ్డితో మితిమీరి ప్రవర్తించిన ఇంటర్వ్యూపై కూడా అదే పని చేశారు. ఆషు రెడ్డి కాలి బొటన వేలుని నాకడం నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు.  ఇటీవల తన సినిమా “డేంజరస్”ప్రమోషన్ లో భాగంగా ఆషురెడ్డితో ఓ ఇంటర్య్యూ చేసిన ఆర్జీవీ… ఆ ఇంటర్య్వూ చివర్లో ఆమె పాదాలకు ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకోవడమే కాదు.. కాస్త అసభ్యకరంగా ఆమె కాలి వేళ్లను.. నోట్లో పెట్టుకున్నారు.

ఇక ఆ పనితో ఎప్పటిలాగే నెట్టింట వైరల్ అయ్యారు. అందరూ తనను దుమ్మెత్తి పోసేలా చేసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే తన చేసిన పనిని సమర్థించుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఆషురెడ్డితో తాను మాట్లాడిన మాటలు, చేసిన పనులు అన్నీ తమ వ్యక్తిగతం అని చెప్పారు ఆర్జీవీ. ట్విట్టర్ అనేది పర్సనల్ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ అని అందులో తాను పెట్టిన పోస్ట్‌లు, వీడియోలు నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా తనకు నచ్చిందే మాట్లాడతానని, తనకు నచ్చిందే చేస్తాను మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. చెప్పడమే కాదు.. ఇది కంటిన్యూ అవుతుందని ఈ సారి కాస్త గట్టిగా చెప్పారు. ఇక వీడియో చివర్లో ‘నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి’ అంటూ ముగించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్  చేయండి..