టాలీవుడ్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్.. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య టికెట్స్ రేట్స్ వివాదం ముదురుతోంది. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ లీడర్లకు మధ్య తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయడంపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఇక గత రెండుమూడ్రోజులుగా ఈ వివాదం పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ఏపీ పొలిటికల్ లీడర్లను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ సినిమాట్రోగ్రఫీ మంత్రి పేర్ని నానికి నిన్న వరుస ప్రశ్నలను సందించారు ఆర్జీవి.
ఇక వర్మ ప్రశ్నలకు ఈరోజు ఉదయం పేర్ని నాని స్పందించారు. ఆర్జీవి ట్వీట్లను జత చేస్తూ ఆయన అడిగిన ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదే సమయంలో ఆర్జీవీకి మరిన్ని ప్రశ్నలు వేశారు పేర్నినాని. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?..అంటూ రివర్స్ అటాక్ చేశారు నాని. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ కౌంటరిచ్చారు నాని.
ఇదిలా ఉంటే.. తాజాగా పేర్ని నాని ప్రశ్నలకు వర్మ స్పందించారు. తనకు ఎంతో డిగ్నిటీతో సమాధానం చెప్పినందకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో.. థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
ట్వీట్.
థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది https://t.co/vNmYLAXmty
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
My answers to the A P government’s honourable cinematography minister @perni_nani gaarus questions https://t.co/xwPXvOiuQ4
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..
Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి