RGV Nijam Channel: అబద్దాల బట్టలూడదీస్తానంటున్న ఆర్జీవి.. నిజం ఛానెల్‌లో మొదటి ఎపిసోడ్‌లో..

|

Apr 25, 2023 | 1:30 PM

ఆర్జీవీ అనే ఓ బ్రాండ్ బయోపిక్ లు అంటే అసలైన అర్ధం నిజాన్ని చూపించడమే అంటూ ఆయన పలువురి రాజకీయ ప్రముఖుల జీవిత కథలను సినిమా గా తెరకెక్కించి వివాదాలను మూటగట్టుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు సమాజంలో జరిగే విషయాల పై కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందిస్తారు.

RGV Nijam Channel: అబద్దాల బట్టలూడదీస్తానంటున్న ఆర్జీవి.. నిజం ఛానెల్‌లో మొదటి ఎపిసోడ్‌లో..
Rgv Nijam
Follow us on

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. నిజం ఛానెల్ తో అబద్దం వెనక దాగున్న నిజాలను బయట రప్పిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవీ అనే ఓ బ్రాండ్ బయోపిక్ లు అంటే అసలైన అర్ధం నిజాన్ని చూపించడమే అంటూ ఆయన పలువురి రాజకీయ ప్రముఖుల జీవిత కథలను సినిమా గా తెరకెక్కించి వివాదాలను మూటగట్టుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు సమాజంలో జరిగే విషయాల పై కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందిస్తారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఆయన చాలా మంది ప్రముఖులను తన ట్వీట్స్ తో ప్రశ్నించారు. తాజాగా నిజం ఛానల్ ను నేడు ఆయన ఓపెన్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి.. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి ,చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడు తూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుందిఅని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ ఛానెల్ లో కేవలం రాజకీయాల పైనే కాకుండా సమాజంలో జరిగే చాలా విషయాల పై రకరకాల వ్యక్తులను ప్రశ్నింస్తాం అని అన్నారు ఆర్జీవీ. అలాగే ఈ ఛానెల్ లో మొదటి ఎపిసోడ్ వివేకానంద రెడ్డి చావు వెంక నిజం గురించి ఉంటుంది అన్నారు వర్మ. వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు వర్మ.