
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసిన సంచలనమే.. ఏం మాట్లాడినా వివాదమే.. ఆయన చేసిన సినిమాలు పలురకాలుగా చర్చలకు దారి తీస్తుంటాయి. కరోనా సమయంలో వరుసగా ఓటీటీ వేదికగా సినిమాలను అనౌన్స్ చేసి హల్ చల్ చేశారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రేమ అనేది అబ్బాయి అమ్మాయి మధ్య మాత్రమే పుట్టాలని రూల్ లేదు.. ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రేమించుకోవచ్చు ఇదే విషయాన్ని తన సినిమాతో చూపించనున్నారు వర్మ. డేంజరస్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమాలో హాట్ భామలు అప్సరరాణి , నైన గంగూలి నటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీగా ఉన్నారు. ఢిల్లీలో డేంజరస్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. డేంజరస్ చిత్రంలో నటించిన హీరోయిన్ నైనా గంగూలీ, అప్సర రాణి తో ట్రైలర్ విడుదల చేశారు వర్మ. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 8 వతేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఏపీ లో టికెట్ల రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు. అలాగే ఈ సినిమాను ఓ.టి.టి,థియేటర్లలో రెండింటిలో విడుదల చేస్తాం అని తెలిపారు. ఇక డేంజరస్ సినిమా 40 రోజుల్లో పూర్తి చేశాను.. అని అన్నారు. అలాగే వర్మ మాట్లాడుతూ.. తనకు కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా నచ్చిందని..త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.
మరిన్ని ఇక్కడ చదవండి :