
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభియనం చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. కానీ అప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోస్, వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. అయితే రెండు రోజులుగా ఈ సినిమా గురించి అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం అంతా సిద్ధమైన తర్వాత చివరి నిమిషంలో శంకర్ దాన్ని క్యాన్సిల్ చేశారంటూ వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది చిత్రయూనిట్. “కొందరు ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం వల్లే గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది” అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ మొదటిసారిగా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
The September schedule of #GameChanger has been cancelled only due to few artists’ unavailability. The shoot will resume in the second week of October.
– Team Game Changer.
— Sri Venkateswara Creations (@SVC_official) September 24, 2023
ఇక ఈ సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలాసార్లు ఈ మూవీ నుంచి ఫోటోస్, సాంగ్స్ లీక్ కావడంతో మేకర్స్ సీరియస్ అయ్యారు. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ఇటు గేమ్ ఛేంజర్ సినిమాతోపాటు .. అటు ఇండియన్ 2 సినిమాను రూపొందిస్తున్నారు శంకర్. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
Here’s the first look of #GameChanger
Happy Birthday Megapower Star @AlwaysRamCharan💥@shankarshanmugh @advani_kiara @yoursanjali @DOP_Tirru @MusicThaman @artkolla @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/JpGohGhaeh
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.