Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

|

Dec 27, 2021 | 7:46 PM

ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..
Upasana
Follow us on

ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా.. అపోలో అధినేత మనరాలిగా.. అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్‏ రంగంలో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ ఫిట్ నెస్, ఆరోగ్యంకు సంబంధించిన అప్డేస్ట్స్ షేర్ చేస్తుంటారు. సామాజిక సేవ కార్యక్రమాలను చేయడంలో ఉపాసన కొణిదెల ముందుంటారు. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్ గోల్డెన్ వీసాను సొంతం చేసుకున్నారు ఉపాసన. క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి అందుకున్నట్లుగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఈ క్రిస్మస్‏కు మంచి బహుమతి లభించింది. వసుధైక కుటుంబం.. ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్ వీసా పొందడం సంతోషంగా ఉంది. ఇండియా ఎక్స్‏పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ బహుమతి అందింది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల దుబాయ్ 2020 ఎక్స్‏పోను ఉపాసన సందర్శించి అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

ట్వీట్..

దుబాయ్ గోల్డెన్ వీసాను వివిధ రంగాల్లో అంటే కళలు.. క్రియేటివిటి, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్ విద్య, వారసత్య సంపద చరిత్ర గురించి అధ్యాయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా నివాసం ఉండేందుకు వీలుంటుంది. 2019 నుంచి ఈ వీసాలు జారీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్‌ అవుతుంది. వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు.

Also Read: RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్‏లో చూసేయ్యండి..

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..