Ram Charan : సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి టాప్ డైరెక్టర్ శంకర్. అయితే ఇన్ని హిట్ సినిమాలను రూపొందించిన శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ తీయలేదు. తాజాగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ , ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే చరణ్ శంకర్ సంబంధించి ఎదో ఒక వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్తే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ కీలక పాత్ర కొసం నాలుగు బాషల నుంచి నలుగురు స్టార్ హీరోలను తీసుకోనున్నారట .
సినిమాలో మరో కీలక పాత్ర కోసం నాలుగు భాషల్లో నలుగురు ప్రముఖ స్టార్లను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. హిందీ వెర్షన్ కోసం సల్మాన్ ని సంప్రదించారని మెగా ఫ్యామిలీతో , చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సల్మాన్ అగీకరించే వీలుందని తెలుస్తోంది. అలాగే కన్నడంలో ఉపేంద్ర లేదా సుదీప్ నటిస్తారని అంటున్నారు. సుదీప్ ఇంతకుముందు మెగాస్టార్ నటించిన సైరా సినిమా లో నటించారు కాబట్టి అతడు వెంటనే అంగీకరిస్తారు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించే వీలుంది. చిరుతో సైరా.. వైష్ణవ్ తో ఉప్పెనలో నటించిన సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రకు అంగీకరిస్తారని భావిస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్ లో పవన్ లేదా చిరు నటించే వీలుందని చెబుతున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :