RRR Movie: ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ నుంచి రోజూ ఏదో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవుతున్న వేళ… జనవరి 07న ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న వేళ.. మరో ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జక్కన్న భావోద్వేగాల మిలితంగా తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు సోదరుల దేశ భక్తిని.. ఆ భక్తికి తలొగ్గి బ్రిటీష్ వారితో చేసే వీరోచిత పోరాటాన్ని హృద్యంగా కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ పోరాట సన్నివేశాన్ని 30 నిమిషాల నిడివి ఉండేలా.. తీర్చిదిద్దారట జక్కన్న. ఆ సన్నివేశంలో పోరాడుతూ అజయ్ దేవ్‌గన్ ఆయన సతీమణి శ్రీయ మరణిస్తారట. అంతేకాదు ఈ సన్నివేశంతోనే చెర్రీ, తారక్ ఎదురుపడతారట. దీంతో ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి మరీ షూట్ చేశారట జక్కన్న. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సీన్‌ను సినిమాలో అలాగే ఉంచబోతున్నరాట. ఇప్పుడిదే న్యూస్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా పైగా బాలీవుడ్ స్టార్ కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎలాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :