Ram Charan : మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోపాటు చరణ్ మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీలో చరణ్ , చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రెండు షడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ వరకు పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు. ఇదిలా ఉంటే చరణ్ జెర్సీ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. జెర్సీ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు చరణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. చరణ్ లతోను సితార బ్యానర్లో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. చరణ్ తో సినిమా చేసినా అది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది” అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ జరగనుంది. రామ్ చరణ్ త్రివిక్రమ్ సినిమా పై త్వరలోనే అధికార ప్రకటన విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :