RRR Movie: నా పాట చూడు నాటు నాటు అంటూ.. కిరాక్ స్టెప్ప్‌తో అదరగొట్టిన తారక్, చెర్రీలు..

RRR Naatu Naatu Song: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా హీరో కాంబోలో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు సినీ పరిశ్రమలో..

RRR Movie: నా పాట చూడు నాటు నాటు అంటూ.. కిరాక్ స్టెప్ప్‌తో అదరగొట్టిన తారక్, చెర్రీలు..
Rrr Song

Updated on: Nov 10, 2021 | 4:32 PM

RRR Movie: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా హీరో కాంబోలో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు సినీ పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామా అంటూ అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన స్టైల్ లో సినిమా పై  ఆసక్తిని రేకెత్తించేలా ప్రమోషన్ కార్యక్రమం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల అయింది.

 

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ డ్యాన్స్ లో తమదైన శైలిలో విరదీసేవారే.. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నుంచి ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేస్తూ సాగిన ఓ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.