మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్‌తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, అలియాభట్, శ్రియ కీలక పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. అలియా, రామ్ చరణ్, తారక్, జక్కన్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గోన్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినీ విశేషాలతోపాటు.. తనకు ఇష్టమైనన ఫుడ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. మెగా ఫ్యామిలీలో ఫేమస్ అయిన చిరుదోశ గురించి కూడా ముచ్చటించారు చరణ్.
చరణ్ మాట్లాడుతూ.. ” నాకు స్వీట్స్ కంటే కారంగా ఉండేవి ఇష్టం. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ తినేది నేనే. కేవలం ఇవే కాకుండా అన్నింటిని ఎంజాయ్ చేస్తాను… అలా అని నేను భోజన ప్రియుడిని కాదు. నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువగా ఇష్టపడతాను.. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. కాస్త సమయం ఉన్నా అప్పుడప్పుడు వంట చేస్తాను.. కానీ వంట మాత్రం అంతగా రాదు. ఇక మా ఇంట్లో ఫేమస్ చిరు దోశ గురించి కూడా నాకేమి తెలియదు.. అందులో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ ఎప్పుడు చెప్పలేదు. అలాగే నాకు మొక్కజొన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు. వంటల్లో అది లేకుండా చూసుకుంటాను ” అంటూ చెప్పుకొచ్చారు చరణ్. మా అమ్మవాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్ర సమరయోధుడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన ఆరోజులలోనే హక్కులపై పోరాటం చేశారు. అందుకు ఆయనను 15 రోజులకుపైనే జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చారు చరణ్.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత..చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.
Also Read: Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‌ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..