
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా ఇందులో అల్లూరి సీతారామారాజు పాత్రలో చెర్రీ నటనకు భారతీయులు, హాలీవుడ్ మేకర్స్, విదేశీయులు ముగ్దులయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజాలు తారక్, చరణ్ నటన చూసి ఫిదా అయ్యారు. దీంతో వీరిద్దరి పేర్లు వరల్డ్ వైడ్ మారుమోగాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో తమ నటనకు గానూ ఇప్పటికే ఎన్నో అవార్డ్ అందకున్నారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెర్రీ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్.. ఇండియా సెలబ్రెటీలకు కూడా ఇస్తుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్లకు ఈ అవార్డ్స్ వచ్చాయి. షారుఖ్, దీపికా పదుకొణెలకు అవార్డ్స్ రాగా.. ఈసారి రామ్ చరణ్ సైతం చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది ఈ అవార్డ్స్ కోసం రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగ పాప్ గోల్టెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తెలుగు నుంచి రామ్ చరణ్ కు ఈ అవార్డ్ దక్కింది. దీంతో ఇప్పుడు మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#POPGOLDENAWARDS2023 GOLDEN BOLLYWOOD ACTOR OF THE YEAR AWARD WINNER REVEALED!!
CONGRATULATIONS TO #RAMCHARAN For the well deserved honor!! pic.twitter.com/nzfZG1BxDS
— POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023
ఇక ఇటీవలే నెట్ ఫ్లి్క్స్ సీఈవో టెడ్ సరండోస్ మెగాస్టార్ నివాసంలో చిరంజీవి, రామ్ చరణ్ ను కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో అడియన్స్ ముందుకు రానుంది. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు.
#POPGOLDENAWARDS2023 WINNER. THE GOLDEN BOLLYWOOD ACTOR #RAMCHARAN pic.twitter.com/PS7mIZecww
— POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.