
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు చరణ్. నిన్న జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో చెర్రీకి డాక్టరేట్ అందించారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం. సినీ పరిశ్రమలో చెర్రీ అందించిన సేవలకుగానూ ఈ గౌరవం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చరణ్ కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే డాక్టరేట్ అందుకుంటున్న చరణ్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా చరణ్ మట్లాడుతూ..వెల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేని మధురక్షణం అన్నారు. అలాగే మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ మూవీ అని.. అలాగే ఆ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐదు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చేశారు చరణ్.ఇక ఈ మూవీ పక్కా విడుదల తేదీ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన జరగండి జరగండి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గానూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత కీలకపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
#GameChanger will Release in the End of September/October in 5 Languages – #RamCharan pic.twitter.com/yQWfdRCh5C
— TRENDS RAM CHARAN ™ (@CHANAKY81555413) April 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.