AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi : రామ్ చరణ్ స్పెషల్ ఫుడ్ డైట్..! పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డారంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది.. ఈ సినిమా రిలీజ్ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Peddi : రామ్ చరణ్ స్పెషల్ ఫుడ్ డైట్..! పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డారంటే
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 8:14 PM

Share

రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ తో బుచ్చుబాబు అద్భుతమైన కథను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే చరణ్ ఈ సినిమాలో ఓ ఆట కూలీగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో చరణ్ క్రికెట్ ఆడటం, కుస్తీ పోటీల్లో పాల్గొనడం చూపించారు. ఇక ఈ సినిమాలో చరణ్ పహిల్వాన్ లుక్ లో అదరగొట్టనున్నారు.

కండలు తిరిగిన దేహంతో చరణ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గద పట్టుకొని రామ్ చరణ్ లుక్ చూడగానే అందరికి హనుమంతుడిలా కనిపించారు. పహిల్వాన్ లుక్ లో చరణ్ అద్భుతమైన ఫైట్ సీన్ కూడా ఉందని తెలుస్తుంది. అయితే చరణ్ పెద్దిలో పహిల్వాన్ లుక్ లో కనిపించడానికి చాలా కష్టపడ్డారు. ఇటీవలే సినిమా కోసం పహిల్వాన్ లుక్ కోసం చేసిన వారౌట్స్ ను ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.

అయితే చరణ్ పహిల్వాన్ లుక్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అయ్యారో తెలుసా.? ‘పెద్ది’ సినిమా కోసం పహిల్వాన్ లుక్ అలాగే క్రాస్ఓవర్ అథ్లెట్‌గా మారడానికి , రామ్ చరణ్ శాకాహార డైట్‌తో పాటు కార్బ్ సైక్లింగ్ (1,800 నుంచి 2,500 కేలరీలు) పాటించాడట. రామ్ చరణ్ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్, మాంసాహార ప్రోటీన్లపై ఆధారపడకుండా అవసరమైన కండరాలను పెంచడానికి ఒక స్వచ్ఛమైన, దేశీయ పోషకాహార విధానాన్ని తయారు చేశారట. శాకాహార ప్రోటీన్: భోజనంలో మొక్కల ఆధారిత ప్రోటీన్లు, పప్పులు, పాల ఉత్పత్తులు (పనీర్ మరియు పాలు వంటివి), అలాగే చిక్కుడు జాతి గింజలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారట.. అలాగే చరణ్ తన మాక్రోలపై సంపూర్ణ నియంత్రణ ఉండేలా చూసుకోవడానికి, బయట తినడం మానేసి, కేవలం ఇంట్లో వండిన శాకాహార భోజనానికే కట్టుబడి ఉన్నాడట. అలాగే హైడ్రేషన్ , ఎలక్ట్రోలైట్స్: సాంప్రదాయ పానీయాలు (మజ్జిగ వంటివి) అలాగే తాజా కూరగాయలు అధిక శక్తితో కూడిన కుస్తీ సెషన్‌లకు అవసరమైన హైడ్రేషన్ అలాగే పోషకాలను అందిస్తాయి. వీటితో పాటు సరైన వర్కౌట్స్ ద్వారా రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ లోకి మారారు. రేపు థియేటర్స్ లో చరణ్ పహిల్వాన్ గా దుమ్మురేపనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us