Ram Charan-Upasana: మొదటిసారి కూతురు క్లింకారతో ఇటలీకి రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఎందుకంటే..

చరణ్ చేతిలో తన పెట్ రైమ్‏.. ఉపాసన ఒడిలో మెగా ప్రిన్సె్స్ క్లీంకార ఉన్నారు. చెర్రీ, ఉపాసన క్యాజువల్ లుక్‏లో కనిపించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే క్లీంకారకు మాత్రం ఇదే మొదటి ఫారిన్ ట్రిప్ కానుంది. తన కూతురు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఉపాసన నడుస్తోన్న ఫోటోస్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరు కలిసి మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి పనుల కోసం ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan-Upasana: మొదటిసారి కూతురు క్లింకారతో ఇటలీకి రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఎందుకంటే..
Ram Charan Upasana

Updated on: Oct 18, 2023 | 3:04 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణితో కలిసి ఇటలీకి బయలుదేరారు. వారిద్దరూ మొదటిసారి తమ కూతురు క్లింకారతోపాటు.. చరణ్ పెట్ రైమ్‏ను తీసుకొని వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. చరణ్ చేతిలో తన పెట్ రైమ్‏.. ఉపాసన ఒడిలో మెగా ప్రిన్సె్స్ క్లీంకార ఉన్నారు. చెర్రీ, ఉపాసన క్యాజువల్ లుక్‏లో కనిపించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే క్లీంకారకు మాత్రం ఇదే మొదటి ఫారిన్ ట్రిప్ కానుంది. తన కూతురు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఉపాసన నడుస్తోన్న ఫోటోస్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరు కలిసి మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి పనుల కోసం ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లిక పనులు చరణ్, ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనుంది. ఈ విషయాన్ని ఇటీవల ఉపాసన తన ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్, ఉపాసన కలిసి వెళ్తుండడంతో వరుణ్, లావణ్య పెళ్లి పనుల కోసమే అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మూవీలో చరణ్ మొదటిసారి పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం ఉంటుందని అంటున్నారు. గతంలో విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత ఆసక్తిని పెంచేశాయి.

ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే వచ్చే నెలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుండడంతో చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణ నుంచి బ్రేక్ తీసుకుని పెళ్లి పనుల కోసం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్, ఉపాసనలతోపాటు.. మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫోటోస్ సైతం నెట్టింట వైరలవుతున్నాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.