Ram Charan: కుట్టి వచ్చేసింది.. సంతోషం వ్యక్తం చేసిన చరణ్ ఉపాసన
రామ్ చరణ్ సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయం ఇస్తూ ఉంటారు. అలాగే చరణ్ జంతుప్రేమికుడు అని అందరికి తెలుసు. చరణ్ ఆయన భార్య ఉపాసన ఇంట్లో ఎన్నో రకాల జంతువులను, పెంచుతూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ పెంపుడు చిలక తప్పించుకుపోయింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంతు ప్రేమికుడు అని చాలా మందికి తెలుసు. రామ్ చరణ్ ఇంట్లో ఎన్నో రకాల జంతువులు, పక్షకులు ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన జంతువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలోనూ జంతువుల గురించి పక్షకుల గురించి, వాటి సంరక్షణ గురించి నిత్యం పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు. రామ్ చరణ్ దగ్గర రైమ్ అనే కుక్కపిల్ల కూడా ఉన్న విషయం తెలిసిందే. అలాగే బాద్షా, కాజల్, బ్లేజ్ అనే గుర్రాలు కూడా ఉన్నాయి. అలాగే రకరకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. వాటితో పాటు కుట్టి అనే ఆఫ్రికన్ గ్రే చిలక ఉంది. ఆ చిలక కొద్దిరోజుల క్రితం తప్పిపోయింది.
హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 25లో కుట్టి మిస్ అయ్యిందని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుట్టి అనే ఆఫ్రికన్ గ్రే చిలక తప్పిపోయిందని ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ వారు చిలుకను వెతికి పట్టుకున్నారు. ఆ చిలకను రామ్ చరణ్ దంపతులకు తిరిగి ఇచ్చారు.
ఇందుకు సంబందించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిలక ఇంటికి రాగానే అది వెంటనే వెళ్లి చరణ్ భుజం పైకి వెళ్లి కూర్చుంది. తన పెట్ ను తిరిగి అందించిన యానిమల్ వారియర్స్ టీమ్ కు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. అలాగే యానిమల్ వారియర్ టీమ్ చిలుకను ఎలా రెస్క్యూ చేశారో వివరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




