పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీతో సౌత్‌లోనూ నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బన్నీ. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో అదరగొట్టారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ సాధించిన సంచలన విజయంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఇక ఇప్పుడు బన్నీ ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోసం రంగంలోకి దిగాడు. ఆమె నటించన మాషుక అనే ప్రైవేట్ సాంగ్ లాంచ్ చేయనున్నాడు బన్నీ. ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ?. తను మరెవరో కాదు టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్.
చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న రకుల్. హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ప్రైవేట్ సాంగ్‌లో స్టెప్పులేసింది. మాషుక అనే ప్రైవేట్ స్పెషల్ చేసింది రకుల్. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మాషుక ఫుల్ సాంగ్‌ను జూలై 29న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్న తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పింది రకుల్. ఇది నా ప్రపంచం..ఈ పాటను విడుదల చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఈ పాటకు డింపుల్ కొటేచా కొరియోగ్రఫీ చేయగా.. తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.
Super exciteddddd to share that my favvvvv @alluarjun will be launching #Mashooka Telugu and Tamil on 29th July . This means the world to me and thankyouuuu for doing this Bunny! You are the best and fav for a reason?? pic.twitter.com/r1HavcRv25
— Rakul Singh (@Rakulpreet) July 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.