Rakul Preet Singh: ‘తెలుగు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉంది.. అయినా నాకు నేనే పోటీ’.. రకుల్ ఆసక్తికర కామెంట్స్..

ప్రస్తుతం ఇండస్ట్రీలలో బిజీగా ఉండే నటీమణులలో ఒకరైన రకుల్... పరిశ్రమలో పోటీని ఎలా ఎదుర్కొంటారనే విషయంపై స్పందించింది. ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rakul Preet Singh: తెలుగు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉంది.. అయినా నాకు నేనే పోటీ.. రకుల్ ఆసక్తికర కామెంట్స్..
Rakul Preeth Singh

Updated on: Oct 15, 2022 | 9:01 AM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో చివరిసారిగా కొండపొలం సినిమాలో కనిపించిన రకుల్.. ఇటీవల డాక్టర్ జీ చిత్రంతో నార్త్ థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలలో బిజీగా ఉండే నటీమణులలో ఒకరైన రకుల్… పరిశ్రమలో పోటీని ఎలా ఎదుర్కొంటారనే విషయంపై స్పందించింది. ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మిమీ చిత్రాన్ని చూసి తాను కృతి సనన్ కు వాయిస్ నోట్ పంపినట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో పోట అనేది.. తన సమకాలీనుల గురించి..తనను ఎలా మెరుగ్గా చేయడానికి ప్రేరేపిస్తుందనే విషయాన్ని తెలిపింది.

రకుల్ మాట్లాడుతూ.. ” ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో పోటీ ఎప్పుడూ ఉండదు. నాకు నేనే పోటీ అని భావిస్తాను. అంతేకాదు.. నన్ను నాకు అతి పెద్ద పోటీదారుడిగా చూస్తాను. నటుడిగా ఒక సినిమా నుంచి మరో సినిమాకి ఎదగడమే నా లక్ష్యం. నేను చేసే ప్రతి పనిలో ప్రజలు తేడా చూడాలని నేను కోరుకుంటున్నాను. నేనే చేయాలనుకుంటున్నాను. నేను సెల్ఫ్ మేడ్ అమ్మాయిని. ఇండస్ట్రీకి వచ్చి 8-9 సంవత్సరాలు అయ్యింది. నేను అలా భావిస్తే తెలుగులో పోటీతత్వం ఉంది.. తమిళంలోనూ పోటీ ఉంది..పోటీ అనేది మాకు మరింత మెరుగ్గా ఉండేందుకు సహయపడుతుంది. నేను అలాగే ఆలోచిస్తాను. నాతో ఉన్నవారు ఎక్కువగా నటిస్తే అది నన్ను ప్రేరేపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నేను మిమీ చిత్రాన్ని చూసి కృతి సనన్ కు వాయిస్ నోట్ పంపాను. అది మనల్ని మరింత మెరుగ్గా మార్చుకునేందుకు సహయపడుతుంది. అలాగే అలియా భట్ ఏదైన గొప్ప పని చేసినప్పుడు మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. దాని నుంచి నేర్చుకొని మరింత ముందుకు వెళ్లేందుకు సహయపడుతుంది.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ థాంక్ గాడ్ చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.