రకుల్ ప్రీత్ సింగ్ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే .. క్లారిటీ ఇచ్చిన రకుల్ మేనేజర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ కూడా ఒకరు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ కూడా ఒకరు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఆతర్వాత వరుసగా ఆవకాశాలు దక్కించుకుంటూ.. దూసుకుపోతుంది. దాదాపు అందరు యంగ్ హీరోల సరసన నటించిన ఈ చిన్నది అటు బాలీవుడ్ లోను ఆఫర్లు దక్కించుకుంటుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల పై రకరకాల రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రకుల్ నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ ఆమె మేనేజర్ హరినాథ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు,తమిళ్, హిందీ కలుపుకొని రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను కన్ఫామ్ చేయలేదు.ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా రకుల్ కనిపించనుంది. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన ‘చెక్’ అనే సినిమాలో నటిస్తుంది. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ లాయర్ గా కనిపించనుంది. ఇక తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలానే బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ నటిస్తున్న ‘మేడే’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. వీటితో పాటు అర్జున్ కపూర్ సరసన ఒక సినిమాలో నటిస్తుండగా.. జాన్ అబ్రహం హీరోగా వస్తోన్న ‘అటాక్’లో రకుల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రకుల్.