ఇంటర్నెట్ వినియోగం సినీ సెలబ్రిటీలను, ఫ్యాన్స్‌ను మరింతగా దగ్గర చేసింది ఇదిలా ఉంటే హీరో గానీ, హీరోయిన్ గానీ ఏవైనా ఫోటోలు అప్‌లోడ్ చేస్తే.. వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలం చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ‘Throwback Thursday’ అంటూ హీరోయిన్లు తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అటు హిందీ.. ఇటు తెలుగు, తమిళం భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. ‘కెరటం’లా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి.. ‘లౌక్యం’ చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించింది. గుర్తొచ్చిందా.! ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఆమె హిందీలో 5 చిత్రాలు చేస్తుండగా.. తమిళంలో ఒకటి.. తెలుగు, తమిళ బైలింగ్యువల్ చిత్రం ఒకటి చేస్తోంది. అలాగే ఇటీవల తన పుట్టినరోజు నాడు బాలీవుడ్ హీరో జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది. అతడిని ఉద్దేశించిన ”లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??