ఇక మీదట నో మోర్ పరేషాన్ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు ఆడియన్స్ కాస్త దూరం పెట్టినా.. ఐ హ్యావ్ మై ఓన్ స్పేస్ అనే ధైర్యంతో వున్నారామె. ఇప్పటికే నార్త్‌లో ఈ దూకుడుకి సాటెవ్వరు అంటున్న రకుల్‌ని.. మరో హిందీ సినిమా ఛాన్స్ తలుపు తట్టిందండోయ్.
రకుల్ హీరోయిన్‌గా డాక్టర్‌జీ అనే కొత్త మూవీ అనౌన్స్ అయింది. అనుభూతి కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్యాంపస్ కామెడీ డ్రామాలో రకుల్ మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తారట. ఈవిధంగా… ఆయుష్మాన్ ఖురానాతో ఫస్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు మేడమ్ భ్రమరాంబ.
దేదే ప్యార్ దే తర్వాత అజయ్‌దేవగన్ సినిమాలలో తెగ కనిపిస్తున్నారు రకుల్. అజ్జీతో కలిసి థ్యాంక్‌గాడ్, మేడే మూవీస్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఎటాక్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్ అనే రెండు సినిమాలున్నాయి రకుల్ కిట్టీలో. తమిళ్‌లో ఇండియన్2 అటకెక్కితే ఎక్కింది.. అయలాన్ అనే మరో మూవీలో చేస్తున్నారు. తెలుగులో నితిన్ చెక్ మూవీ రిలీజ్‌కి రెడీగా వుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో గొర్రెల కాపరిగా వెరైటీ ట్రై చేస్తున్నారు. టోటల్‌గా ఎనిమిది సినిమాలు.. ఇది కదా.. బౌన్స్ బ్యాక్ అంటే..!
Also Read: