AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Weds Rambai Review: రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ.. నిజమైన పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉందంటే..

అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. టీజర్, ట్రైలర్ తోపాటు ఈ సినిమాను విడుదలైన సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ 21న విడుదలైంది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం...

Raju Weds Rambai Review: రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ.. నిజమైన పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉందంటే..
Raju Weds Rambai
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 11:48 AM

Share

మూవీ రివ్యూ: రాజు వెడ్స్ రాంబాయి

నటీనటులు: అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, అనిత చౌదరి, జయకృష్ణ, చైతు జొన్నలగడ్డ తదితరులు

ఎడిటర్: నరేష్ అడుప

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రాఫర్: వాజిద్ బయాగ్

నిర్మాతలు: వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి

దర్శకుడు: సాయిలు

అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ 21న విడుదలైంది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం…

కథ:

కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా కాలం పాటు వెంటాడుతాయి.. రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా అలాంటిదే. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ ఇది. ఎలాంటి కల్మషం లేకుండా సాగే ఈ ప్రేమ కథలో ఎన్నో మనసు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఒకే కథలో చాలా విషయాలు చెప్పాడు దర్శకుడు సాయిలు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ అఫ్ అంత బాగానే వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. కేవలం హీరో డప్పు కొట్టినందుకు హీరోయిన్ ప్రేమలో పడుతుంది అని చూపించడం కాస్త ఓవర్గా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఇన్నోసెన్స్ సినిమాకు ప్లస్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.. ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండింది.. కీలకమైన సెకండ్ హాఫ్ వెరీ ఎమోషనల్ నోట్ లో వెళ్ళింది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్.. ఎవరు ఊహించని ఒక బరువైన క్లైమాక్స్ మనసును మరింత బరువెక్కేలా చేసింది. అయితే ఇలాంటి కథలు ప్రేక్షకులకు అంత ఈజీగా ఎక్కవు. దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు. ముఖ్యంగా చాలా చిన్న కథను క్లైమాక్స్ వరకు లాగినట్టు అనిపించింది.

నటీనటులు:

అఖిల్ రాజ్, తేజస్వి రావు ఇద్దరు పోటీ పడి నటించారు.. శివాజీ రాజా, అనిత చౌదరి నటన కూడా బాగుంది.. ఇందులో చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ చైతు జొన్నలగడ్డ.. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించాడు. మిగిలిన వాళ్ళందరూ బాగా నటించారు.

టెక్నికల్ టీం:

టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ నేను కాస్త షార్ప్ గా ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సాయిలు హానెస్ట్ అటెంప్ట్ చేశాడు.. వంశీ నందిపాటి మరొకసారి ఒక మంచి సినిమాను పిక్ చేశాడు. కాకపోతే క్లైమాక్స్ కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా రాజు వెడ్స్ రాంబాయి.. వెరీ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర