Raju Weds Rambai: ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశాడు .. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా నిర్మాత ఎమోషనల్

నీది నాది ఒకే కథ, విరాట ప‌ర్వం సినిమాలతో టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఊడుగుల. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి 'రాజు వెడ్స్ రాంబాయి' అనే మరో డిఫరెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

Raju Weds Rambai:  ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశాడు .. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నిర్మాత ఎమోషనల్
Raju Weds Rambai Movie Producer Venu Udugula

Edited By: Rajitha Chanti

Updated on: Dec 01, 2025 | 6:32 AM

చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ విలేజ్ లవ్ స్టోరీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.12 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. గతంలో అతను నీది నాది ఒకే కథ, విరాట ప‌ర్వం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు నిర్మాత గా మారి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు వేణు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాను పంచుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్.

 

‘నా మొదటి సినిమా (నీది నాది ఒకే కథ) ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, నేను కొన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను. అప్పులు చాలా ఉండేవి. ఒక‌రోజు శ్రీవిష్ణు నన్ను చూసి ఎందుకు మీరు ఇలా ఉంటారు ఎప్పుడు ఏదో బాధతో అని అడిగాడు. ఏమైన అప్పులు ఉన్నాయా అని అడిగాడు. దానికి నేను కూడా చిన్న చిన్న‌వే అంటూ చెప్పాను. దీంతో నా ప‌రిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ విష్ణు ఆ మ‌రుస‌టిరోజే నాకున్న అప్పుల‌న్నీ తీర్చేశాడు. ఆయ‌న‌కు ఏం అవ‌స‌రం ఇది చేయ‌డానికి.. అయినా కూడా చేశాడు. ఆరోజు శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నా సినిమాకు కేవలం హీరో మాత్రమే కాదు, నా కష్టకాలంలో నాకు అండగా నిలబడిన ఒక దైవంగా భావిస్తాను’ అంటూ వేణు ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరై సంగతి తెలిసిదే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి