AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Weds Rambai: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఉచితంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టికెట్లు.. పూర్తి వివరాలివే

నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.10 కోట్ల కు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు

Raju Weds Rambai: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఉచితంగా 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా టికెట్లు.. పూర్తి వివరాలివే
Raju Weds Rambai Movie
Basha Shek
|

Updated on: Nov 26, 2025 | 10:18 PM

Share

చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో భయపెట్టాడు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.10 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు. కొత్త డైరెక్టర్ అయినా తన టేకింగ్, మేకింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే కొత్త వారైనా హీరో, హీరోయిన్లు కూడా చాలా సహజంగా నటించారని ప్రశంసలు వస్తున్నాయి. కాగా తమ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమా మరింత మందికి రీచ్ అయ్యేలా మహిళలకు ఉచిత సినిమా టికెట్ల ఆఫర్ ను ప్రకటించింది.

‘మా రాంబాయి కథ’.. ప్రతి మహిళ కోసం.. ఆంధ్రా అండ్ సీడెడ్ మేజర్ సెంటర్స్ లో ఫ్రీగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా స్క్రీనింగ్’ అంటూ ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్. అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుంది. అది కూడా రేపు ఒక్క రోజు మాత్రమే. సినిమా చూడాలనుకుంటోన్న మహిళలు డైరెక్టుగా థియేటర్ల వద్దకు వెళ్లి టికెట్లు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ థియేటర్లలో మాత్రమే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం.. ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం
శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం.. ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం