Raju Weds Rambai: మట్టి కథ బలం ఇది.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’.. 4 రోజుల్లో..!

సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్‌ రాజ్, తేజస్విని జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. విశేష ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది. సింగిల్‌ థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి. చిత్ర నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ...

Raju Weds Rambai: మట్టి కథ బలం ఇది.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న రాజు వెడ్స్ రాంబాయి.. 4 రోజుల్లో..!
Raju Weds Rambai

Updated on: Nov 25, 2025 | 7:07 PM

ఇటీవలి కాలంలో మౌత్ టాక్ కారణంగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. మూవీలో అఖిల్ రాజ్- హీరోయిన్ తేజస్విని జంటగా నటించారు. ఇల్లెందు, మహబూబాబాద్​లో జరిగిన యదార్థ ఘటనకు తెరరూపం ఇచ్చాడు దర్శకుడు సాయిలు. అతని మేకింగ్ స్టైల్ బాగుందని.. మట్టి కథను హృద్యంగా మలిచాడంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.  నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. థియేటర్లలో నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో తెలుసుకుందాం పదండి..

ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చినప్పటి నుంచి కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించిన​ వివరాల ప్రకారం ఇప్పటివరకూ రూ. 9.08 కోట్ల గ్రాస్​ రాబట్టింది. రిలీజైన ఫస్ట్ డే రూ. 1.15కోట్ల కలెక్షన్లు బాక్సాఫీస్​ వద్ద నమోదు చేసుకుంది. ఆ తర్వాత శనివారం రూ. 2.15 కోట్లు రావడం విశేషం. ఆదివారం ఫుల్ హలిడే అవ్వడంతో… రూ.2.5 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికీ సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కాగా సోమవారం కూడా రూ.1.31 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది ఈ చిత్రం. వచ్చే రెండు వారాల వరకు మరో పెద్ద సినిమా విడుదల ఏదీ షెడ్యూల్‌లో లేదు. సో.. రెండో వారంలో మంచి కలెక్షన్లు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాకు పాజిటివ్​ టాక్​ రావడంతో మరో 100 షోలు అదనంగా యాడ్ చేశారు.

ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మాతలు కలిసి చిత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ మూలాల నుంచి తీసిన ఈ సినిమా.. ఒరిజినల్ కంటెంట్‌కు ఆడియెన్స్ ఎంత బ్రహ్మరథం పడతారో నిరూపిస్తుంది.