
బాలీవుడ్‌లోని టైర్-2 హీరోలు తరచూ డిఫరెంట్ మూవీలతో ఆకట్టుకుంటారు. కంటెంట్ బాగుందంటే చాలు.. కలెక్షన్లు కూడా అదిరిపోతాయి. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ మూవీ మంచి టాక్ తెచ్చుకుని.. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఏంటి.? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.? ఇప్పుడు తెలుసుకుందామా..
ఆ సినిమా 2022లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘బదాయి దో’. రాజ్‌కుమార్ రావు, భూమి ఫెడ్నేకర్, సీమా పహ్వా, షీబా చడ్డా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హర్షవర్దన్ కులకర్ణి దర్శకత్వం వహించాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. పీటీ టీచర్‌గా పని చేస్తోన్న సుమన్ అనే అమ్మాయిని.. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు అని.. ఆమె ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తుంటారు. ఇక మరోవైపు సర్దన్ ది కూడా ఇదే పరిస్థితి. పోలీస్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉంటాడు. అతడి పెళ్లి వయస్సు కూడా దాటిపోతుంది. ఈ క్రమంలో సుమన్ ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయితో చాటింగ్ చేస్తుంది. కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మాయిని కలవాలని అనుకుంటుంది.
కానీ ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుస్తుంది. అతడితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అయితే ఆ అబ్బాయి మాత్రం సుమన్‌ని బ్లాక్ మెయిల్ చేస్తూ.. తనతో మాట్లాడాలని.. అలా చేయకపోతే నువ్వు లెస్బియన్ అని అందరికీ చెప్పేస్తా అంటాడు. ఇక సుమన్ ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో సర్దన్‌కు కంప్లైట్ చేస్తుంది. కంప్లయింట్ చూసిన సర్దన్.. ఓ ఉపాయం ఆలోచిస్తాడు. తను కూడా లెస్బియన్ కావడంతో ఇద్దరం పెళ్లి చేసుకుని.. ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుందాం అని అంటాడు. ఈ ఐడియా సుమన్‌కు నచ్చి.. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ కూడా వాళ్ల లవర్స్‌ను తెచ్చుకుని.. హనీమూన్‌లో ఎంజాయ్ చేస్తారు. అయితే పెళ్లి జరిగి ఇన్నేళ్ళు అయినా.. పిల్లలు పుట్టకపోవడంతో.. వాళ్ల వాళ్ల కుటుంబాల్లో డౌట్ వస్తుంది. ఇక కుటుంబాలు పెట్టే ఒత్తిడికి ఓ పిల్లాడిని దత్తతు తీసుకోవాలనుకుంటారు సుమన్, సర్దన్.. అయితే ఈలోగా రెండు కుటుంబాలకు వీరిద్దరూ లెస్బియన్స్ అని తెలిసిపోతుంది. చివరికి సుమన్, సర్దన్ రిలేషన్ ఏమవుతుంది? వీరి లైఫ్ ఎటు వెళ్తుంది? అనేది సినిమా చూసి తెలుసుకోండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి